అనకాపల్లి: విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదవాలని అచ్యుతాపురం గ్రంథాలయం అధికారి కోటేశ్వరరావు సూచించారు. ఆదివారం స్థానిక గ్రంథాలయంలో చదవడం మాకిష్టం కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులతో ఆయన పుస్తకాలను చదివించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు ఇష్టంతో చదవాలన్నారు. అలాగే లక్ష్యాన్ని నిర్దేశించుకుని దానిని చేరేందుకు కృషి చేయాలన్నారు.