కోనసీమ: కొత్తపేట రెవెన్యూ డివిజన్ పరిధిలోని 61 రేషన్ దుకాణాలకు సంబంధించి ఆదివారం కొత్తపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రేషన్ డీలర్ల నియామకానికి సంబంధించి రాత పరీక్షలు నిర్వహించారు. రెవెన్యూ డివిజనల్ అధికారి ఆధ్వర్యంలో జరిగిన ఈ పరీక్షకు 112 మందికి 109 మంది అభ్యర్థులు హాజరయ్యారని రెవెన్యూ అధికారులు తెలిపారు. రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని తెలిపారు.