ATP: హీరో నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’ మూవీ విజయోత్సవ వేడుక ఈనెల 22న అనంతపురంలో జరగనుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ పరిశీలించారు. శ్రీనగర్ కాలనీలోని అయ్యప్పస్వామి ఆలయం వద్ద వేడుక జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. సుమారు 25వేల మంది తరలివస్తారని అంచనా వేస్తున్నట్లు వివరించారు.