AP: కూటమి ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల్లోనే రాష్ట్రానికి రూ.3 లక్షల కోట్ల విలువైన సహకారం అందించామని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు. ‘విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూ.11,440 కోట్లు ప్రకటించాం. ఉక్కు పరిశ్రమను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తాం. విశాఖ రైల్వే జోన్‌ను త్వరలో పట్టాలెక్కిస్తాం. రూ.2 లక్షల కోట్లతో వైజాగ్‌లో గ్రీన్ హైడ్రోజన్ జోన్ ఏర్పాటు చేస్తాం’ అని తెలిపారు.