విశాఖ: ఆరిలోవ తోటగరువులో మురళీకృష్ణ క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో పది రోజుల నుంచి నిర్వహిస్తున్న టీపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ బుధవారం ముగిసింది. టోర్నమెంట్లో కేఈ టైటాన్ జట్టు విజేతగా నిలిచింది. విజేతగా నిలిచిన కేఈ టైటాన్స్ జట్టుకు రూ.20 వేల నగదు బహుమతి అందజేశారు. ద్వితీయ స్థానంలో నిలిచిన శ్రీవాసు లయన్స్‌కు రూ.10 వేల నగదు అందజేసినట్లు నిర్వాహకులు తెలిపారు.