విశాఖ: అరకులోయ మండలం గిర్లిగూడ గ్రామం నుంచి డుంబ్రిగుడ మండలం పరిశీల గ్రామానికి సుమారు నాలుగున్నర కిలోమీటర్ల రోడ్డు, మధ్యలో వంతెన నిర్మాణం చేపట్టాలని సీపీఎం పార్టీ మండల కార్యదర్శి కిండంగి రామారావు డిమాండ్ చేశారు. ఈమేరకు బుధవారం స్థానికులతో కలిసి నిరసన తెలిపారు. ఆయా గ్రామాలకు రహదారి సౌకర్యం లేకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన చెందుతున్నారు.