KDP: ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి వేంపల్లె వైస్ ఎంపీపీ బాబా షరీఫ్ వైఎస్సార్ ఫోటోలతో చిత్రీకరించిన డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బుధవారం పులివెందులలోని ఎంపీ స్వగృహంలో బాబా షరీఫ్ కోరిక మేరకు డైరీని ఆవిష్కరించారు. వైఎస్ కుటుంబంపై అభిమానంతో వైఎస్సార్ కుటుంబ సభ్యుల ఫోటోలతో చేయించి తన అభిమానాన్ని చాటుకున్నందుకు ఎంపీ అభినందించారు.