NGKL: పదర మండలం ఉడి మిళ్లలో రైతు సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన ఎద్దుల బండలాగుడు పోటీలను ఎమ్మెల్యే వంశీ కృష్ణ ప్రారంభించారు. మొదటి బహుమతి రూ.50 వేలు, రెండవ బహుమతి రూ.30 వేలు, 3వ బహుమతి రూ.20వేలుగా నిర్వాహకులు ప్రకటించారు. సంక్రాతి పండుగ బండలాగుడు పోటీలు ఏర్పాటు చేయడం అభినందనీయమని నిర్వాహకులను ఎమ్మెల్యే అభినందించారు.