KMM: ఐదు రోజుల సుదీర్ఘ విరామం అనంతరం ఖమ్మం వ్యవసాయ మార్కెట్ గురువారం రోజున తిరిగి ప్రారంభం కానుంది. శని, ఆదివారం వారాంతపు యార్డు బంద్, సోమ, మంగళ, బుధవారం సంక్రాంతి సందర్భంగా మార్కెట్ బంద్ ఉంది. దీంతో రేపు ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరకులను మార్కెటుకు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు వెల్లడించారు.