WGL: వరంగల్ నగరంలో పోలీసులు రెండు రోజులుగా విస్తృత తనిఖీలను చేపట్టారు. ప్రజలు సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వ గ్రామాలకు వెళ్లిన నేపథ్యంలో చోరీలకు అవకాశం ఉండడంతో గస్తీని ముమ్మరం చేశారు. వరంగల్ ఏసీపీ నందిరం నాయక్ నేతృత్వంలో సీఐలు ఎస్సై లతోపాటు పోలీసు సిబ్బంది లాడ్జీలు, హోటల్స్తో పాటు రహదారులను దిగ్భందించి వాహనాలను తనిఖీ చేశారు.