MHBD: ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి ఒక్కరికి అందించాలని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సూచించారు. బుధవారం కలెక్టరేట్లో ఆయన ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఎంపీఓలు, మున్సిపల్ కమిషనర్స్, సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై కలెక్టర్ పలు సూచనలు చేశారు.