అన్నమయ్య: రిమ్స్ ఇంఛార్జ్ సీఐ వి సీతారాం రెడ్డి ఆధ్వర్యంలో కడప జిల్లా సిద్దవటం మండల పరిధిలోని టక్కోలి డేగనవారిపల్లి, మాచుపల్లి గ్రామాల్లో పండుగ సందర్భంగా పర్యటించారు. అక్రమ ఇసుక రవాణ, కోడిపందాలు, పేకాట స్థావరాలపై ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ సుబ్బరామచంద్ర, పోలీసులు కిరణ్, జయదేవ్ పాల్గొన్నారు.