KDP: ప్రొద్దుటూరు మండలం గోపవరానికి చెందిన గోపిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి(53) బ్రెయిన్ డెడ్‌కు గురయ్యారు. వివరాల్లోకి వెళితే.. రాజశేఖర్ ఈనెల 1న బైక్‌పై నుంచి పడి అపస్మారక స్థితికి వెళ్లారు. 11 రోజుల చికిత్స అనంతరం వైద్యులు బ్రెయిన్ డెడ్‌గా నిర్ధారించారు. దీంతో అతని భార్య శ్రీదేవి అవయవదానానికి సహకరించారు. దీంతో అతని అవయవాలతో నలుగురికి పునర్జన్మను కల్పించారు.