NRPT: తిరుమల తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా బిజ్వార్ గ్రామానికి చెందిన మహిళలు 5 రోజులు శ్రీ వెంకటేశ్వర స్వామి సేవలో పాల్గొన్నారు. ప్రతి రోజూ 6 గంటల పాటు శ్రీవారి సేవలో పాల్గొంటున్నామని, సేవకు అవకాశం లభించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. సేవలో పద్మమ్మ, సునీత, వసుందర, జయమ్మ, సత్యమ్మ, నర్మదా, మమత, సుశీలమ్మ, సుజాత పాల్గొన్నారు.