KMM: అశ్వారావుపేట మండలంలో ఆర్ఎంపీ, పీఎంపీ మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే తెలంగాణ స్టేట్ ఆర్ఎంపీ, పీఎంపీ అసోసియేషన్ 18వ వార్షికోత్సవ సభకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పాల్గొన్నారు. నిరుపేదలకు మెరుగైన వైద్యం అందజేయాలని సూచించారు. అనంతరం యూనియన్ క్యాలెండర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.