KMM: రఘునాథపాలెం మండలం ముంచుకొండలో సోమవారం మధ్యాహ్నం 3గంటలకు ఎత్తిపోతల పథకం శంకుస్థాపన సందర్భంగా నిర్వహిస్తున్న సభను జయప్రదం చేయాలని డీసీసీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్ కోరారు. ఖమ్మం మంత్రి తుమ్మల క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం శంకుస్థాపనకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, తుమ్మల హాజరవుతారని తెలిపారు.