NRML: పాన్ ఇండియా సంస్థ సహకార భారతి 47వ ఆవిర్భావ దినోత్సవాన్ని సహకార భారతి నిర్మల్ జిల్లా కమిటీ, లోకమాన్య సహకార సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిర్మల్ పట్టణంలోని ఉమామహేశ్వర ఆలయంలో ఘనంగా నిర్వహించారు. విశ్వహిందూ పరిషత్ విభాగ ధర్మాచార్య సంపర్క రాజేందర్ మాట్లాడుతూ సహకార వాదాన్ని భారతీయులు అలవాటు చేసుకోవాలని అన్నారు. సహకార సంఘాలను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.