NZB: నవీపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ సంక్రాంతికి ఊరెళ్లే వారు తమ బంగారం, డబ్బును తమ వెంట తీసుకెళ్లాలని ఎస్సై వినయ్ కుమార్ సూచించారు. అలాగే ఊరికి వెళ్లే సమయంలో ఇరుగుపొరుగు వారికి సమాచారం ఇవ్వాలన్నారు. ఇంటి చుట్టుపక్కన ఎవరైనా అనుమానాస్పదంగా తిరిగితే 100 డయల్ చేసి సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు.