MNCL: సంక్రాంతి పురస్కరించుకొని జన్నారం పట్టణంలో మహిళలకు నిర్వాహకులు ముగ్గుల పోటీలు ఏర్పాటు చేశారు. సంక్రాంతి సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం జన్నారం పట్టణంలోని మైదానంలో మహిళలకు, యువతులకు నిర్వాహకులు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జన్నారం పట్టణంతో పాటు పరిసర గ్రామాల నుండి మహిళలు, యువతులు తరలివచ్చి అందమైన ముగ్గులు వేస్తున్నారు.