NRML: ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఓ వివాహితను బ్లూ కోర్టు సిబ్బంది కాపాడిన ఘటన ఆదివారం నిర్మల్లోనీ కంచరోని చెరువు వద్ద చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య చేసుకుంటున్నట్లు డయల్ 100కు ఫోన్ రాగా స్పందించిన సిబ్బంది గణేష్, తిలక్ సంఘటనా స్థలానికి వెళ్లి వివాహితను కాపాడి కుటుంబ సభ్యులకు అప్పగించారు.