MNCL: శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్లో ఆదివారం రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా సీఐ వేణు చందర్ మాట్లాడుతూ వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు భద్రత నియమాలు పాటించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు సంతోష్, ప్రసన్న, జిల్లా ఆటో యూనియన్ అధ్యక్షులు చెల్ల విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.