KNR: స్వామి వివేకానంద జయంతి సందర్భంగా హుజురాబాద్ పట్టణంలోని స్వామి వివేకానంద జయంతి విగ్రహానికి పూలమాల వేసి మున్సిపల్ ఛైర్పర్సన్ గందె రాధిక శ్రీనివాస్ నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. వివేకానందుడు యువతకు స్ఫూర్తి ప్రధాత అని కొనియాడారు. ఈ జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటారని తెలిపారు.