మరికొన్ని గంటల్లో కొత్త సంవత్సరం ప్రారంభం కానుంది. అయితే, 2025 సంవత్సరం జనవరిలో దాదాపు 10 రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. సాధారణంగా ఉండే రెండు, నాలుగవ శనివారం, ఆదివారాలు బ్యాంకులు పనిచేయవు. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో జనవరి 1వ తేదీనే సెలవుతో బ్యాంకులు కొత్త ఏడాదిని ప్రారంభించనున్నాయి. వచ్చే ఏడాదికి సంబంధించి సెలవుల జాబితా విడుదల అయ్యాక దీనిపై స్పష్టత రానుంది.