MBNR: బొంరాసస్ పేట మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో చలి తీవ్రంగా ఎక్కువైంది. దీంతో ప్రజలు రాత్రివేళ, ఉదయం పూట చలిమంటలు కాస్తూ ఉపశమనం పొందుతున్నారు. మరోవైపు ఉదయం 7 దాటినా మంచు కురవడంతో రైతులు పొలాలకు వెళ్లేందుకు జంకుతున్న పరిస్థితులు ఉన్నాయి. వాతావరణంలో మార్పుల కారణంగా మేఘాలు కమ్ముకొని పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి.