ఒక్కోసారి ఒక్క వ్యక్తి మొత్తం సీన్‌ని మార్చేయగలుగుతాడు. ఇప్పటి స్థితిగతులలో ఆ ఒక్కడే దిల్ రాజు అనబడే ఈ శక్తి. శక్తి అని ఎందుకు రాయాల్సివచ్చిందటే ఇటువంటి అస్తవ్యస్తమైన వ్యవహారాన్ని సర్దుబాటు చేయడం అంత సులభమైన విషయం కానేకాదు. దానికెంతో లోతైన వ్యక్తిత్వం, అనుభవం అంతకుమించిన విశ్వసనీయత చాలా అవసరమవుతాయి
వచ్చాడయ్యో సామి అన్న పాట గుర్తుందా? ఆ సీనులో కరెక్టు టైంకి హీరో మహేష్‌బాబు ఎంటర్ అవుతాడు. అక్కడ పరిస్థితికి కొండంత అండగా నిలబడతాడు. అదే టైమిప్పుడు తెలుగు సినిమా పరిశ్రమకి వచ్చింది మొన్నీమధ్యన. అనుకోని పరిస్థతిలో సంధ్య ధియేటర్లో రేవతి అనే మహిళ తొక్కిసలాటలో అతిదారుణంగా చనిపోయింది. పుష్ఫ 2 సినిమాకి పబ్లిక్‌లో విపరీతమైన క్రేజ్, హైప్ రావడంతో ఎక్కడ చూసినా జనమే. అది ఏ సినిమాకైనా సరే గొప్ప ప్లస్ పాయంట్. కానీ అదే ప్లస్ పాయంట్ దురదృష్టవశాత్తు మైనస్ పాయంట్ అయింది. విధి వైపరీత్యం. ఇంక అక్కడనుంచి ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది అన్నది ఏ మాత్రం అంచనాకి కూడా అందకుండా ఒకదానికొకటి అంటుకుపోయి, అల్లుకుపోయి చిందరవందరగా మారిపోయి, ఛిన్నాభిన్నమైపోయింది. ఎవ్వరు దీన్ని సర్దుబాటు చేయగలరు అనే మిలియన్ డాలర్ క్వశ్చన్ అందరిలోనూ రేకెత్తింది. జస్ట్…సరదాకి కూడా ఎవ్వరికీ ఒక్క పేరు కూడా తట్టలేదు.
కానీ విచిత్రం ఏంటంటే….ఒక్కోసారి ఒక్క వ్యక్తి మొత్తం సీన్‌ని మార్చేయగలుగుతాడు. ఇప్పటి స్థితిగతులలో ఆ ఒక్కడే దిల్ రాజు అనబడే ఈ శక్తి. శక్తి అని ఎందుకు రాయాల్సివచ్చిందటే ఇటువంటి అస్తవ్యస్తమైన వ్యవహారాన్ని సర్దుబాటు చేయడం అంత సులభమైన విషయం కానేకాదు. దానికెంతో లోతైన వ్యక్తిత్వం, అనుభవం అంతకుమించిన విశ్వసనీయత చాలా అవసరమవుతాయి. అయ్యాయి. కానీ ఈ వ్యవహారం శృతిమించి చేయజారిపోకముందు, జస్ట్ కొంచెం ముందే దిల్‌రాజుని తెలంగాణ ఫిల్మ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియమించి ఉత్తర్వులు జారీ చేశారు. అందరూ ఆనందించారు. ఎందుకంటే దిల్‌రాజు కొంతమంది వ్యతిరేకులున్నా కూడా అజాతశతృవుగా, అందరికీ ఆత్మీయుడిగా సుస్థిరమైన స్థానాన్ని సాధించుకున్నారు. ఈ స్థానం అందరికీ కొరుకుడు పడేదికాదు. అందరిచేత గొప్ప, మంచి అనిపించుకున్నవారికి అత్యంత సహజంగానే కనిపించని శతృవులు పుట్టుకొస్తారు. కానీ దిల్‌రాజు అనుక్షణం ఉద్యమించే వ్యక్తి. అయన ప్రతీ అడుగూ చిత్రపరిశ్రమలో ఏదో విభాగానికి ప్రోత్సాహకారిగా, బలాన్ని చేకూర్చేదిగానే నిరూపితమవుతూ ఎంతో కాలంగా వస్తోంది. చిత్రపరిశ్రమలో అందరికీ ఆయన కావాలి. ఆయనకి అందరూ కావాలి. అదీ దిల్‌రాజు స్థానం చిత్రపరిశ్రమలో. అటువంటి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కి ఛైర్మన్‌గా రావడం పరిశ్రమకి ఏరువాకలా వచ్చింది.
అదే సమయానికి పుఫ్ప 2 విడుదల సందడి. ఆయనకూడా శ్రీరాములు ధియేటర్లో మీడియాతో పాటు కల్సి చూశారు. అదీ సినిమా పట్ల ఆయనకున్న కమిట్మెంట్. అదే రోజు రాత్రి సంధ్య ధియేటర్లో రేవతి అనే మహిళ విపత్కర పరిస్థితులలో చనిపోయారు. ఆమె కొడుకు, అల్లు అర్జున్ ఫేన్ దారుణంగా దెబ్బతిని ఆసుపత్రి పాలయ్యాడు. దిల్‌రాజు గేమ్‌ఛేంజర్ ఫంక్షన్ అమెరికాలో జరిగే వ్యవహారంలో కొంచెం బిజీగానే ఉన్నారు. తలపెట్టిన కార్యక్రమం కోసం అమెరికా వెళ్ళారు. ఇక్కడ అన్నీ ఒకదానిక తర్వాత ఒకటి జరిగిపోతున్నాయి. అల్లు అర్జున్ మీద కేసు, తర్వాత అరెస్టు. మర్నాడే విడుదల. ఇలా ఎవ్వరికీ అర్ధం కానంత వేగంతో తోసుకుపోయాయి.
కానీ, దిల్‌రాజు అన్నిటినీ చూస్తునే ఉన్నారు. అమెరికా నుంచి రాగానే అల్లు అర్జున్ వ్యవహరంలో అడుగుపెట్టారు. కొంత ఆలిస్యమైనప్పటికీ కూడా దిల్ రాజు ఎంటర్ అయిన తర్వాత మాత్రం ఒక్క,రోజు గ్యాప్‌లో రేవతిగారి కుటుంబానికి 2కోట్ల సహాయం అందింది. వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినిమా పరిశ్రమ సమావేశం హుటాహుటిన జరిగిపోయింది.
ఇదంతా ఎందుకు రాస్తున్నానంటే, వ్యవస్థను కాపు కాయగలిగే సరైన నాథుడు అన్నవాడు ఒక్కడుంటే చాలు వ్యవస్థకు ఒక రూపం దక్కుతుంది. లేదంటే ఎందరు మహామహులున్నా, మరెందరు దిగ్గజాలున్నా, ఎవరెందరు అతిరథమహారథులున్నా కూడా ప్రయోజనం అన్నది ఉండదు అన్నదానికి ఇటీవలి ఈ సంఘటనే అతిపెద్ద ఉదాహరణ. ఈ సంఘటన ప్రపంచ చలనచిత్ర చరిత్రలోనే గగుర్పాటు కలిగించిన ఓ ప్రత్యేక సంఘటనగా మిగిలిపోతుంది. ఇటువంటి క్లిష్టతరమైన వ్యవహారాన్ని అతి చాకచక్యంగా చక్కబెట్టగలిగే సమర్ధుడు ఒక్క తెలుగు చిత్ర పరిశ్రమలోనే ఉన్నాడని గర్వంగా చెప్పగలిగే సందర్భం ఇది. అ వ్యక్తే దిల్‌రాజు.