WGL: ప్రమాదవశాత్తు చెట్టుకొమ్మతగిలి వ్యక్తికి తీవ్రగాయాలై చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. వర్ధన్నపేట మండలం కట్ర్యాల శివారులో జాతీయ రహదారిపై కడారిగూడెం గ్రామానికి చెందిన దోపతి రవీందర్ రెడ్డి అనే వ్యక్తి నిన్న ఇల్లంద గ్రామానికి వెళ్లి తిరిగి కడారిగూడెం వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అనంతరం అతడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఈ రోజు మృతి చెందాడు.