ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్.. కొరటాల శివతో ఓ భారీ ప్రాజెక్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్టీఆర్ 30 పేరుతో ఆ సినిమాను అనౌన్స్ చేశారు. అలాగే కెజియఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో 31వ సినిమాను ప్రకటించాడు తారక్. అయితే ఇంకా కొరటాల సినిమానే సెట్స్ పైకి వెళ్లలేదు.. కాబట్టి ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ రావడానికి చాలా సమయం పట్టేలా ఉంది.
ఇక ఈ రెండు సినిమాలే ఇలా ఉంటే.. ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు పరిస్థితి మరోలా ఉంది. ఉప్పెన సినిమా వచ్చి రెండు సంవత్సరాలు కావొస్తున్నా.. ఇప్పటి వరకు మరో సినిమా ప్రకటించలేదు. కొడితే గట్టిగానే కొట్టాలని.. ఎన్టీఆర్ కోసం వెయిట్ చేస్తున్నాడు బుచ్చిబాబు. తారక్ కూడా ఈయనతో సినిమా చేసేందుకు ఒకే చెప్పాడని చాలా రోజులుగా వార్తలు వస్తునే ఉన్నాయి. అయినా కొరటాల, ప్రశాంత్ నీల్ సినిమాల తర్వాతే బుచ్చిబాబు సినిమా ఉండే ఛాన్స్ ఉంది.
అదే జరిగితే దానికోసం ఇంకొన్నాళ్లు ఎదురు చూడక తప్పదు. అందుకే మధ్యలో బుచ్చిబాబు మరో చిన్న హీరో సినిమా చేసేందుకు ట్రై చేస్తున్నట్టు టాక్. కానీ ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఇది కూడా తన గురువు సుకుమార్ రిఫరెన్స్‌తోనే చేయబోతున్నట్టు సమాచారం. రీసెంట్గా చరణ్‌తో కథా చర్చలు కూడా జరిపినట్టు టాక్. అంతేకాదు.. సుకుమార్ పర్యవేక్షణలో ప్రస్తుతం బుచ్చిబాబు స్క్రిప్ట్ డెవలప్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. మరి చరణ్తోనైనా బుచ్చిబాబుకు వర్కౌట్ అవుతుందేమో చూడాలి.