ADB: ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పారదర్శకంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు. మంగళవారం తలమడుగు మండల కేంద్రంలో క్షేత్రస్థాయిలో పర్యటించి ఇందిరమ్మ ఇళ్ల వివరాల సేకరణ ప్రక్రియను పరిశీలించారు. పకడ్బందీగా సర్వే నిర్వహించడంతో పాటు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.