TG: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో సీన్ రీ కన్స్ట్రక్షన్ చేయనున్నట్లు తెలుస్తోంది. విచారణ తర్వాత అల్లు అర్జున్ను సంధ్య థియేటర్‌కు తీసుకెళ్లే ఛాన్స్ ఉంది. దీంతో థియేటర్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కాగా, అల్లు అర్జున్ను చిక్కడపల్లి పీఎస్‌లో గంటన్నరగా డీసీపీ ఆకాంక్ష్, ఆయన బృందం విచారిస్తున్న విషయం తెలిసిందే.