NLR: గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అనికేపల్లి పంచాయతీలో రూ.20కోట్ల భారీ భూ కుంభకోణం జరిగిందని టీడీపీ మండల అధ్యక్షులు గుమ్మడి రాజా యాదవ్ విమర్శించారు. సోమవారం తహశీల్దార్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. చాకలి చెరువు కింద 20ఎకరాల ప్రభుత్వ భూమికి నకిలీ పట్టాలు సృష్టించి రూ.20 కోట్లకు వైసీపీ నేత కోడూరు ప్రదీప్ కుమార్ రెడ్డి అమ్ముకున్నారన్నారు.