HYD: మాదాపూర్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఇనార్బిట్‌మాల్ సమీపంలోని సత్య భవనంలో భారీగా మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రమాదంలో ముగ్గురు గాయపడినట్లు, ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.