AP: విశాఖలో హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టురట్టు అయింది. కిరండోల్-విశాఖ ఎక్స్ప్రెస్లో బాలికల అక్రమ రవాణాను పోలీసులు గుర్తించారు. మొత్తం 11 మందిని రైల్వే పోలీసులు కాపాడినట్లు తెలుస్తోంది. నిందితుడిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ మారుమూల ప్రాంతాల నుంచి బాలికల అక్రమ రవాణా జరుగుతున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 100 మందికి పైగా బాలికలను అక్రమ రవాణా చేసినట్లు వెల్లడించారు.