AP: సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మడకశిర మండలంలోని బుళ్లసముద్రం సమీపంలో జాతీయ రహదారిపై ఆగిఉన్న లారీని మినీ వ్యాను ఢీకొట్టింది. ఘటనలో నలుగురు మృతిచెందారు. మరో 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను బెంగళూరు ఆసుపత్రికి తరలించారు. మృతులు గుడిబండ, అమరాపురం మండలాల వాసులుగా పోలీసులు గుర్తించారు. తిరుమల దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.