KMM: రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధురాలు మృతి చెందిన ఘటన కారేపల్లి మండలంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఎస్ఐ రాజారాం వివరాలు ప్రకారం.. కారేపల్లి మండలం మధురానగర్ తండాలో వాంకుడోత్ లక్ష్మీ తన భర్తతో కలిసి ఆటోలో వెళ్తుండగా వెనకనుంచి బొలెరో వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో వృద్ధురాలు లక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై ఎస్ఐ రాజారాం కేసు నమోదు చేశారు.