RR: చైతన్య పురి పోలీసు స్టేషన్ పరిధిలో పాత కక్షల నేపథ్యంలో శుక్రవారం కొత్తపేట-నాగోల్ ప్రధాన రహదారి మోహన్‌నగర్‌లోని ఏయూ బ్యాంక్‌లోకి చొరబడి ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకున్నారు. దాడిలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు క్షతగాత్రులను వైద్య చికిత్స నిమిత్తం స్థానిక ప్రయివేట్ హాస్పిటల్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.