JGL: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడలు- 2024లో భాగంగా సారంగాపూర్ మండలం రెచపల్లి గ్రామానికి చెందిన శ్రీ ప్రజ్ఞ రాష్ట్ర స్థాయి పోటీలకు బ్యాడ్మింటన్, కిక్ బాక్సింగ్ విభాగంలో ఎంపికైంది. ప్రస్తుతం ఆమె స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన ప్రజ్ఞను పలువురు అభినందిస్తున్నారు.