కడప: నగరంలో మాజీ సీఎం జగన్ పేరుతో వెలిసిన రాజకీయ ఫ్లెక్సీ కలకలం రేపుతోంది. ‘జగన్కు చేసింది చెప్పుకోవడం చేతకావడం లా..’ అని వెలసిన ఫ్లెక్సీ కడపలో రాజకీయంగా దుమారం లేపుతోంది. కడప ఆర్ట్స్ కళాశాల మైదానం వద్ద ఈ ఫ్లెక్సీ ప్రజలకు దర్శనం ఇవ్వడంతో ఎవరు ఏర్పాటు చేశారన్న అయోమయంలో అటు ప్రజలు, ఇటు రాజకీయ నాయకులు ఉన్నారు. ఈ ఫ్లెక్సీని ఎవరు ఏర్పాటు చేశారా అని అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.