కేంద్రమంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై తమిళ నటుడు, తమిళగ వెట్రి కళగం వ్యవస్థాపకుడు విజయ్ కౌంటర్ ఇచ్చారు. అంబేద్కర్ పేరు వింటే కొందరికి అలర్జీ అని మండిపడ్డారు. అంబేద్కర్ సాటిలేని రాజకీయ మేధావని కొనియాడారు. స్వేచ్ఛా వాయువులు పీల్చిన భారత ప్రజలందరూ ఆయనను గౌరవించారని చెప్పారు. అంబేద్కర్ పేరు వింటే మనసు, పెదవులకు సంతోషంగా ఉంటుందని అన్నారు. ఆయనను అవమానించడాన్ని సహించబోమంటూ ధ్వజమెత్తారు.