MDK: తూప్రాన్ పట్టణంలోని రేణుక ఎల్లమ్మ ఆలయంలో మంగళవారం రేణుక ఎల్లమ్మ జమదగ్ని మహర్షి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు భూమన్నగారి నందంగౌడ్ తెలిపారు. దేవి ఉపాసకులు, సోమయాజుల రవీంద్ర శర్మ ఆధ్వర్యంలో వైదిక నిర్వహణలో ఉదయం 11:15 గంటలకు నిర్వహిస్తున్నట్లు వివరించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై కళ్యాణ మహోత్సవంలో పాల్గొనాలని కోరారు.