తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. ఉత్తర తెలంగాణలో సింగిల్ డిజిట్‌కు టెంపరేటర్లు పడిపోయాయి. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ మహానగరంలో గత వారం రోజుల నుంచి చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. ఉష్ణోగ్రతలు 15 డిగ్రీలకు చేరుకున్నాయి. ఏపీలోని ఏజెన్సీల్లో దట్టమైన పొగమంచు అలుముకుంది. కనిష్ఠంగా 5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుండడంతో చలి తీవ్రతకు ప్రజలు అల్లాడిపోతున్నారు.