AP: గన్నవరం విమానాశ్రయానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేరుకున్నారు. రాష్ట్రపతికి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ సాదర స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి రాష్ట్రపతి నేరుగా మంగళగిరి ఎయిమ్స్ తొలి స్నాతకోత్సవానికి వెళ్లనున్నారు. ఈ స్నాతకోత్సవంలో 49 మంది MBBS విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేయనున్నారు. నలుగురు వైద్య విద్యార్థులకు బంగారు పతకాలను అందించనున్నారు