ఆర్ఆర్ఆర్(RRR) సినిమా రిలీజ్ అయి ఏడు నెలలు కావొస్తున్నా.. ఇంకా రచ్చ రచ్చ చేస్తునే ఉంది. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లతో సత్తా చాటిన ఈ సినిమా.. ఓటిటిలో అంతకు మించి అనేలా దుమ్మలేపింది. ముఖ్యంగా హాలీవుడ్ ప్రముఖులు ఆర్ఆర్ఆర్ చూసి ఫిదా అయిపోయారు. దాంతో ఆస్కార్ రేసులో ఆర్ఆర్ఆర్ నిలవడం పక్కా అని అంటున్నారు. ఇప్పటికే ఆస్కార్ ప్రమోషన్స్ కోసం రంగంలోకి దిగిపోయాడు రాజమౌళి. అయితే ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు జక్కన్న. ఒక్క రాజమౌళి అనే కాదు.. చరణ్, తారక్ కూడా మరోసారి ప్రమోషన్స్‌తో సందడి చేస్తున్నారు.
అక్టోబర్ 21న జపాన్(Japan)లో గ్రాండ్ రిలీజ్ అవుతోంది ఆర్ఆర్ఆర్. దాంతో జపాన్‌లో గట్టిగానే ప్రమోట్ చేస్తున్నారు ఆర్ఆర్ఆర్ త్రయం. ఈవెంట్స్, మీడియా ఇంటర్వ్యూలతో హల్ చల్ చేస్తున్నారు. ఇక అక్కడ చరణ్, ఎన్టీఆర్ క్రేజ్ నెక్ట్స్ లెవల్లో ఉంది. ఎన్టీఆర్ ఉంటున్న హోటల్లో ఓ లేడీ అభిమాని.. ఎన్టీఆర్‌కు వెల్కమ్ నోట్ రాసి, దానిపై ఎన్టీఆర్ ఫొటోను అతికించింది. ఈ లెటర్ అందుకున్న ఎన్టీఆర్.. ఆమె అభిమానానికి ఫిదా అయిపోయాడు. ఆమెకు షేక్ హ్యాండ్ ఇచ్చి కాసేపు మాట్లాడాడు.
ప్రస్తుతం జపాన్ లెటర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక చరణ్ జపాన్లోకి అడుగు పెట్టగానే.. తన గత సినిమాల పోస్టర్స్‌తో సర్ప్రైజ్ చేశారు జపనీయులు. దాంతో జపాన్‌లో ఆర్ఆర్ఆర్ క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా వాళ్ల అభిమానాన్ని తట్టుకోలేకపోతున్నారు ఎన్టీర్-చరణ్-జక్కన్న. ఇక ఈ ముగ్గురు కాస్త గ్యాప్ తర్వాత ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో.. ఫుల్ ఖుషీ అవుతున్నారు అభిమానులు.