»Kerala Kochi Fire In Garbage Yard Rs 100 Crore Fined By Ngt
Kochi: చెత్త యార్డులో మంటలు..రూ.100 కోట్ల ఫైన్ వేసిన NGT
కేరళలోని కొచ్చి మునిసిపల్ కార్పొరేషన్(kochi Municipal Corporation) తన విధుల పట్ల నిర్లక్ష్యం(negligence)గా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) రూ.100 కోట్ల ఫైన్ విధించింది. కొచ్చిలోని చెత్త డంప్ సైట్లో అగ్నిప్రమాదం జరిగినందుకు గాను పర్యావరణ నష్ట పరిహారంగా చెల్లించాలని వెల్లడించింది.
కేరళ కొచ్చిలోని చెత్త డంప్ ప్రదేశంలో అగ్నిప్రమాద ఘటనపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) కఠిన చర్యలు తీసుకుంది. విధుల పట్ల నిర్లక్ష్యం వహించినందుకు గాను కొచ్చి మున్సిపల్ కార్పొరేషన్‌పై(kochi Municipal Corporation) ఎన్జీటీ(NGT) రూ.100 కోట్ల నష్టపరిహారం విధించింది. అయితే మార్చి 2, 2023న చెత్త డంప్ ప్రదేశం(garbage yard)లో అగ్నిప్రమాదం(fire accident) సంభవించింది. అప్పుడు పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో భారీగా పొగ వ్యాపించింది. దీంతో కొచ్చి నగరంలో ప్రజలు(people) ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
అవి విషపూరిత వాయువులు కావడంతో ఆ ప్రాంత ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు(officers) ఆదేశాలు జారీ చేశారు. దీంతోపాటు మాస్కులు కూడా ధరించాలని కోరారు. మరోవైపు శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బంది పడుతున్న రోగులను అత్యవసరంగా ఆస్పత్రుల్లో చేర్చుకోవాలని పేర్కొన్నారు. మరోవైపు ఆ చెత్త డంప్ లో మంటలను ఆర్పేందుకు నేవీ సిబ్బంది సహా 30 అగ్ని మాపక యంత్రాల ద్వారా మంటలను అదుపులోకి తెచ్చారు. మరోవైపు హెలికాప్టర్లను కూడా వినియోగించి చర్యలు తీసుకున్నారు. ఆ క్రమంలో మార్చి 5 నాటికి మంటలను పూర్తిగా నియంత్రించారు.
ఈ విషయం తెలుసుకున్న NGT కేసును సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టింది. ఆ క్రమంలో చెత్త కుప్పల(garbage yard) వద్ద అగ్ని ప్రమాదాలను నిరోధించడంలో విఫలమైన కొచ్చి కార్పొరేషన్(kochi Municipal Corporation)పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో సెక్షన్ 15 ప్రకారం పర్యావరణ నష్టానికి గాను రూ.100 కోట్లను చెల్లించాలని వెల్లడించింది. నెల రోజుల్లోగా ఆ నగదును కేరళ చీఫ్ సెక్రటరీకి జమ చేయాలని తెలిపింది. పర్యావరణానికి, ప్రజారోగ్యాన్ని దెబ్బతీసే విధంగా వ్యర్థాల నిర్వహణ విషయంలో చాలా కాలంగా నిర్లక్ష్యం(negligence) చేయబడుతోందని ఎన్జీటీ పేర్కొంది. ఈ నేపథ్యంలో పాలనలో ఘోర వైఫల్యానికి నైతిక బాధ్యత వహించాలని ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. మరోవైపు ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది.