HYD: బహదూర్‌పుర పీఎస్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కిషన్ బాగ్ ప్రాంతంలో జనవాసాల నడుమ ఉన్న స్క్రాప్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే పక్కనే ఉన్న ఎలక్ట్రిక్ ట్రాన్స్ఫార్మర్కి సైతం మంటలు వ్యాపించాయి. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపులోకి తెచ్చారు.