కృష్ణా: రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ కార్యక్రమం కింద సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు ప్రభుత్వం కృషి చేస్తోందని చల్లపల్లి ఎంపీపీ విజయ రాధిక అన్నారు. బుధవారం చల్లపల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ డాక్టర్ అనగాని వెంకటరమణ ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 9ప్రాధాన్యత అంశాలపై ఈ సదస్సు జరిగింది.