NLG: పట్టణానికి చెందిన మాలి లావణ్య ఈ ఏడాది జూలై నెలలో గురుకుల TGT, PGT కొలువులకు ఎంపిక కాగా, ఆ తర్వాత DSCలో ఉద్యోగం, ఇటీవల గెజిటెడ్ జూనియర్ లెక్చరర్ ఉద్యోగం సాధించారు. 2003లో వివాహం చేసుకున్న తర్వాత కొన్నాళ్లు చదువుకు దూరమయ్యారు. చదువుపై ఉన్న ఆసక్తితో దూర విద్యలో డిగ్రీ, ఎంఏ పూర్తి చేశానని, భర్త ప్రోత్సాహంతోనే ఈ ఉద్యోగాలు సాధించానని అన్నారు.