సత్యసాయి: సినీ నటుడు మోహన్ బాబుపై వెంటనే చర్యలు తీసుకోవాలని పుట్టపర్తిలో జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. మోహన్ బాబు డౌన్ డౌన్ అంటూ ఫ్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఆయనపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మీడియా స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది అని వారు తెలిపారు.