NLR: దుత్తలూరు మండలంలోని ఏరుకొల్లు సచివాలయ అధికారులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ.. ఇతర అవసరాల నిమిత్తం సచివాలయం వద్దకు వెళితే సచివాలయ అధికారుల జాడే కనిపించడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఉదయం 10.30 గంటలు దాటినా ఉద్యోగులు ఎవరూ ఉండడంలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.