ATP: పరిగి మండలంలోని సాగునీటి వినియోగదారుల అసాధారణ సర్వసభ్య సమావేశాన్ని శనివారం ఉదయం 9 గంటలకు నిర్వహించనున్నట్లు తహశీల్దార్ హసీనా సుల్తాన తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. జిల్లా కలెక్టర్ గెజిట్ మేరకు ఓటు హక్కు కలిగిన సాగునీటి వినియోగదారులు తమ పట్టాదారు పాసుపుస్తకం, 1బి, అడంగల్, ధృవీకరణ పత్రంతో సర్వసభ్య సమావేశానికి హాజరు కావాలని కోరారు.