ఖమ్మం: తీర్థాల శ్రీ సంగమేశ్వర స్వామి వారి దేవస్థానంలో బుధవారం నూతన కళ్యాణ మండప ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మద్దులపల్లి మార్కెట్ కమిటీ ఛైర్మన్ హరినాథ్ బాబు పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే శ్రీ సంగమేశ్వర స్వామి వారిని ఆయన దర్శించుకున్నారు.